లక్నో: దుస్తులు లేని వ్యక్తులు మహిళలను బెంబేలెత్తిస్తున్నారు. నిర్జన ప్రాంతాలకు వారిని ఈడ్చుకెళ్తున్నారు. దీంతో ‘న్యూడ్ గ్యాంగ్’ (Nude Gang) పట్ల మహిళలు భయాందోళన చెందుతున్నారు. నాలుగు సంఘటనలు జరుగడంతో పోలీసులు డ్రోన్లతో నిఘా పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారాలా గ్రామానికి చెందిన ఒక మహిళ డ్యూటీకి వెళ్లేందుకు ఒంటరిగా నడిచి వెళ్లింది. నగ్నంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆ మహిళను అడ్డుకున్నారు. నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుని పారిపోయింది. తన కుటుంబానికి ఈ విషయం చెప్పింది. నాటి నుంచి ఆ మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు ఉద్యోగం మారింది.
కాగా, ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఇలాంటివి నాలుగు సంఘటనలు జరిగినట్లు గ్రామస్తులు ఆరోపించారు. తాజా సంఘటన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు
దర్యాప్తు చేపట్టారు. డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. నిఘా కోసం సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మహిళల భద్రత కోసం మహిళా పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించినట్లు వెల్లడించారు. అయితే ఆకతాయిల పనిగా కొందరు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.
Also Read:
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి
Watch: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై దాడికి యత్నం.. ఎందుకంటే?