ముంబై: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడ్ని ‘బ్రెయిన్ డెడ్’గా హాస్పిటల్ ప్రకటించింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా అతడు కదలడంతోపాటు దగ్గాడు. (Dead Man Moves In Funeral) దీంతో షాకైన బంధువులు ఆ యువకుడ్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. త్రయంబకేశ్వర్ తాలూకాకు చెందిన 19 ఏళ్ల భావు లచ్కే కొన్ని రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అడ్గావ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు అతడ్ని ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించారు.
కాగా, భావును ఇంటికి తెచ్చిన కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలకు సిద్ధమవుతున్నారు. ఇంతలో ఉన్నట్టుండి అతడు కదలడంతో పాటు దగ్గాడు. దీంతో భావు బతికే ఉన్నట్లు గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందతున్న ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతడి బంధువులు తెలిపారు.
మరోవైపు ఆ యువకుడు మరణించినట్లుగా తాము చెప్పలేదని ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. వైద్యపరమైన పదజాలంపై అతడి కుటుంబ సభ్యులు గందరగోళానికి గురై ఇంటికి తీసుకెళ్లారని ఆరోపించింది.
Also Read
Nude Gang | మహిళలను బెంబేలెత్తిస్తున్న ‘న్యూడ్ గ్యాంగ్’.. డ్రోన్లతో పోలీసుల నిఘా
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి