రాంచీ: మద్యానికి బానిసై తరచుగా గొడవపడుతున్న భర్తను భార్య హత్య చేసింది. (Wife Kills Husband) ఇంట్లో గొయ్యి తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టింది. ఆ వ్యక్తి కనిపించకపోవడం, ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తిలైయాటన్ గ్రామానికి చెందిన గిరిజనులైన 42 ఏళ్ల సుర్జీ మజ్హియాన్, 45 ఏళ్ల సురేష్ హన్స్డా భార్యాభర్తలు.
కాగా, గత కొన్ని రోజులుగా సురేష్ కనిపించడం లేదు. పది రోజుల కిందట చనిపోయిన మామ అంత్యక్రియలకూ అతడు హాజరుకాలేదు. భర్త అదృశ్యంపై భార్య సుర్జీ పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో సురేష్ బంధువులు ఆమెపై అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం బంధువులు, పొరుగువారు కలిసి ఆ ఇంట్లోకి వెళ్లారు. ఒక గది నుంచి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సురేష్ భార్య సుర్జీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మద్యానికి బానిసైన భర్త రోజూ గోడవపడుతున్నాడని, ఇతర మహిళలతో అతడికి వివాహేతర సంబంధం ఉన్నదని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట జరిగిన ఘర్షణలో కర్ర, కొడవలితో దాడి చేసి భర్తను చంపినట్లు పోలీసులకు చెప్పింది.
కాగా, శనివారం ఆ ఇంట్లోని గదిలో తవ్వి సురేష్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడు ఎన్ని రోజుల కిందట హత్యకు గురయ్యాడు అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Amity student slapped | స్టూడెంట్ చెంపపై 30 సార్లు కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్
Dead Man Moves In Funeral | ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటన.. అంత్యక్రియలప్పుడు కదిలిన యువకుడు
Nude Gang | మహిళలను బెంబేలెత్తిస్తున్న ‘న్యూడ్ గ్యాంగ్’.. డ్రోన్లతో పోలీసుల నిఘా