అహ్మదాబాద్: కొండపై ఉన్న ఆలయం వద్ద కార్గో రోప్ వే తెగింది. (cargo ropeway snaps) ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మరణించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శక్తిపీఠమైన పావగఢ్ కొండ ఆలయం వద్ద గూడ్స్ రోప్‌వే వైర్ తెగిపోయింది. కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లడానికి ఉపయోగించే కార్గో ట్రాలీ కేబుల్స్ తెగిపోయాయి. దీంతో నాల్గవ టవర్ నుంచి ట్రాలీ కిందపడింది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు పంచమహల్ కలెక్టర్ ధృవీకరించారు. మృతుల్లో ఇద్దరు లిఫ్ట్‌మెన్లు, ఇద్దరు కార్మికులు, మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. సాంకేతిక బృందంతో ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతామని అన్నారు.
మరోవైపు పావగఢ్ ఆలయం సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్నది. 2,000 మెట్లు ఎక్కడం లేదా కేబుల్ కార్ల ద్వారా భక్తులు, యాత్రికులు శిఖరానికి చేరుకుంటారు. అయితే శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ప్రజలు ఉపయోగించే రోప్‌వేను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:
Amity student slapped | స్టూడెంట్ చెంపపై 30 సార్లు కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్
Wife Kills Husband | మద్యానికి బానిసైన భర్త.. చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య
Dead Man Moves In Funeral | ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటన.. అంత్యక్రియలప్పుడు కదిలిన యువకుడు
Nude Gang | మహిళలను బెంబేలెత్తిస్తున్న ‘న్యూడ్ గ్యాంగ్’.. డ్రోన్లతో పోలీసుల నిఘా