Boyapati Srinu | బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బోయపాటి .. సన్నీ డియోల్ ‘జాట్ 2’కు దర్శకత్వం వహించే ఛాన్స్..!
Boyapati Srinu | టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శీను తదుపరి సినిమా ఏమిటనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన అఖండ2 మంచి స్పందన పొందిన నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై చర్చలు మొదలయ్యాయి.
Boyapati Srinu | టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శీను తదుపరి సినిమా ఏమిటనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇటీవల ఆయన తెరకెక్కించిన అఖండ2 మంచి స్పందన పొందిన నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బోయపాటి శ్రీను బాలీవుడ్లో అడుగుపెట్టే అవకాశముందన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బోయపాటి శ్రీను తన తదుపరి సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్‌తో చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టాలీవుడ్లో బాలకృష్ణకు ఉన్న మాస్ ఇమేజ్‌లా బాలీవుడ్లో సన్నీ డియోల్‌కు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అతని యాక్షన్ స్టైల్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇప్పటికే సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కించిన యాక్షన్ చిత్రం జాట్ మంచి స్పందన పొందింది. ఈ సినిమా విడుదల తర్వాత ‘జాట్ 2’ సీక్వెల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్‌కు కొత్త దర్శకుడు బాధ్యతలు తీసుకుంటారని అప్పటినుంచే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ‘జాట్ 2’కి దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు దాదాపు ఖరారైనట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే మొదటి భాగం చూసిన చాలామంది ప్రేక్షకులు అది బోయపాటి స్టైల్ యాక్షన్ సినిమాల మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు నిజంగానే బోయపాటి దర్శకత్వంలో సీక్వెల్ వస్తే యాక్షన్ మరింత భారీ స్థాయిలో ఉండే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు.
బోయపాటి శ్రీను సినిమాల్లో కనిపించే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోను పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ఇదే స్టైల్ సన్నీ డియోల్ మాస్ ఇమేజ్‌కు కూడా సరిగ్గా సరిపోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. బోయపాటి శ్రీను – సన్నీ డియోల్ కాంబినేషన్ నిజంగా సెట్స్‌పైకి వస్తే అది టాలీవుడ్ – బాలీవుడ్ కలయికలో మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వార్తలపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

