Prem Rakshith | ఆస్కార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌పై హాలీవుడ్ లెజెండ్ ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో
Prem Rakshith | భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ప్రముఖ అమెరికన్ కొరియోగ్రాఫర్, దర్శకుడు విన్సెంట్ ప్యాటర్సన్ నుంచి ప్రేమ్ రక్షిత్‌కు ప్రశంసలు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Prem Rakshith | భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేసిన ప్రముఖ అమెరికన్ కొరియోగ్రాఫర్, దర్శకుడు విన్సెంట్ ప్యాటర్సన్ నుంచి ప్రేమ్ రక్షిత్‌కు ప్రశంసలు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మైఖేల్ జాక్సన్, మడోన్నా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంగీత దిగ్గజాలకు ఐకానిక్ డాన్స్ స్టెప్స్ రూపొందించిన విన్సెంట్ ప్యాటర్సన్ తాజాగా ప్రేమ్ రక్షిత్ ప్రతిభను ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో విన్సెంట్ ప్యాటర్సన్ మాట్లాడుతూ, “హలో ప్రేమ్.. నేను విన్సెంట్ ప్యాటర్సన్. చాలా సంవత్సరాల పాటు మైఖేల్ జాక్సన్‌తో కలిసి పనిచేశాను. మీ కొరియోగ్రఫీ నిజంగా అద్భుతం. మీరు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సైన్స్‌లో సభ్యుడిగా ఉండటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇండియాలో మీలాంటి యంగ్ కొరియోగ్రాఫర్లు తమ కలలను నిజం చేసుకుంటున్నారు. ఎప్పుడో ఒకరోజు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను” అంటూ అభినందనలు తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండగా, అభిమానులు కూడా ప్రేమ్ రక్షిత్‌కు అభినందనలు తెలుపుతున్నారు. హాలీవుడ్ లెజెండ్ నుంచి వచ్చిన ఈ ప్రశంసలు భారతీయ కొరియోగ్రఫీకి దక్కిన గౌరవంగా పలువురు పేర్కొంటున్నారు.
ఇక విన్సెంట్ ప్యాటర్సన్ సందేశంపై స్పందించిన ప్రేమ్ రక్షిత్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నప్పటి నుంచే మైఖేల్ జాక్సన్ డాన్స్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పారు. ముఖ్యంగా అతని ప్రసిద్ధ గీతం స్మూత్ క్రిమినల్లోని డాన్స్ స్టెప్స్ తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. అలాంటి లెజెండరీ స్టార్‌తో పనిచేసిన వ్యక్తి నుంచి ప్రశంసలు రావడం తనకు ఒక కొరియోగ్రాఫర్‌గా లభించిన అత్యున్నత గౌరవమని తెలిపారు. ప్రేమ్ రక్షిత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం RRR సినిమాలోని నాటు నాటు సాంగ్. ఈ పాటకు ఆయన అందించిన డాన్స్ కంపోజిషన్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఆ పాటకు అకాడమీ అవార్డు లభించడంతో ప్రేమ్ రక్షిత్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మార్మోగింది. ఒక సాధారణ కొరియోగ్రాఫర్ స్థాయి నుంచి ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ లెజెండ్స్ ప్రశంసించే స్థాయికి ఎదగడం నిజంగా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

