దోమలతో బెంబేలు
సాయంత్రం అయిందంటే చాలు.. దోమల దండయాత్రతో గ్రేటర్ జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
- బల్దియాలో దండయాత్ర..నిర్లక్ష్యంగా అధికారులు
- కాగితాల్లోనే ఫాగింగ్.. నిద్రలేమితో ప్రజల విలవిల
- మూసీ పరీవాహకంలో మరీ దారుణం
- దోమల నియంత్రణలో విఫలం
- పక్కదారి పడుతున్న ఫాగింగ్ నిధులు
- మందు కొట్టకుండానే నిధుల దారి మళ్లింపు
- డీజిల్‌ను అవే బంకుల్లో అమ్మేస్తున్న సిబ్బంది!
- అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం
- రోగాల భారిన పుడుతున్న ప్రజలు
అధికారుల అలసత్వం, పారిశుద్ధ్య లోపం పౌరుల పాలిట శాపంగా మారింది. ముఖ్యంగా పారిశుద్ధ్యలోపం కారణంగా ట్రై కార్పొరేషన్ల పరిధిలో దోమలు దండెత్తుతున్నాయి. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా ప్రతీచోట విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతంతో పాటు నాలాలు, చెరువులు, జీవీపీ పాయింట్ల వద్ద దోమల బెడద తీవ్రంగా ఉంది. దోమకాటుకు నగరవాసులు విషజ్వరాల బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఐతే ట్రై కార్పొరేషన్ల (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) ఎంటమాలజీ అధికారుల రికార్డుల్లో మాత్రం దోమల నివారణ చర్యలు అద్భుతంగా సాగుతున్నట్లు కనిపిస్తుండగా, క్షేత్రస్థాయిలో మాత్రం జనం దోమల దాడికి నరకయాతన అనుభవిస్తున్నారు. వీధుల్లో ఫాగింగ్ మెషీన్ల శబ్దం వినిపించి ఏళ్లు గడుస్తోందని, యాంటీ లార్వా ఆపరేషన్లు కేవలం రికార్డులకే పరిమితం అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): సాయంత్రం అయిందంటే చాలు.. దోమల దండయాత్రతో గ్రేటర్ జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంటమాలజీ అధికారుల రికార్డుల్లో నివారణ చర్యలు ఘనంగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్లు కానరాక కాలనీలు, బస్తీల్లో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతాలతో పాటు నాలాలు, చెరువుల్లో గుర్రపుడెక్కను, మురికి కాల్వల్లోని పూడికను తొలగించకపోవడంతో నిల్వ నీరు దోమలకు ఆవాసాలుగా మారింది.
చాదర్‌ఘాట్, మలక్‌పేట, అంబర్‌పేట, ఉప్పల్, బోడుప్పల్, పురానాపూల్, జియాగూడ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 5 దాటితే.. తలుపులు, కిటికీలు మూసినా.. దోమల దాడి ఆగడం లేదు. కాయిల్స్, లిక్విడేటర్లు సైతం పనిచేయక స్థానికులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. విషజ్వరాలతో సామాన్యులు ఆస్పత్రుల పాలవుతున్నా బల్దియా యంత్రాంగం మొద్దు నిద్ర వీడకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్, మలక్‌పేట, అంబర్‌పేట, ఉప్పల్, బోడుప్పల్, పురానాపూల్, జియాగూడలో దోమలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిషారం చూపడం లేదని వారు వాపోతున్నారు. మూసీ నదిలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, మురుగు నీటి కాల్వల కారణంగా దోమలు విపరీతంగా వృద్ధ్ది చెందుతున్నాయి. సాయంత్రం 5 గంటలకే ఇళ్ల తలుపులు, కిటికీలు మూసుకున్నా దోమల దాడి ఆగడం లేదు. కాయిల్స్, లిక్విడేటర్లు పెట్టినా ఏ మాత్రం పనిచేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫాగింగ్ పేరుతో నిధుల మళ్లింపు ..!

జీహెచ్ఎంసీ పరిధిలో 63 పెద్ద, 302 చిన్న ఫాగింగ్ యంత్రాలు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. పెద్ద యంత్రాలకు రోజూ 45 లీటర్ల డీజిల్, 9 లీటర్ల పెట్రోల్, రెండు లీటర్ల మలాథిన్ మందు కేటాయిస్తారు. చిన్న వాటికి రోజూ 9 లీటర్ల డీజిల్, 1.5 లీటర్ల పెట్రోల్, కొద్ది పాటి మలాథిన్ను ఇస్తారు..కానీ కేటాయింపులన్నీ కాగితాలపైనే కనిస్తున్న పరిస్థితి. 80 శాతం డీజిల్‌ను సిబ్బంది.. గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ బంకుల్లోనే విక్రయిస్తామని పెట్రోల్ కూపన్లు అధికారులు, సిబ్బంది వాహనాలకు ఉపయోగించుకుంటున్నారని బల్దియాలోనే జోరుగా చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మలాథిన్ రసాయాన్ని సరఫరా చేసే ఏజెన్సీలకే తిరిగి ఆ మందును వారికే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
వీటన్నిటిలో జోనల్ స్థాయి అధికారులతో పాటు సహాయ ఎంటమాలజిస్టులు, సీనియర్ ఎంటమాలజిస్టులతో పాటు మరికొంతమంది అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు ఫాగింగ్ కోసం జీహెచ్ఎంసీ 600-700 లీటర్ల మేర డీజిల్‌ను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.. ఫాగింగ్‌కు ఏడాదికి రూ.7 కోట్ల మేర వెచ్చిస్తుండగా..దాదాపు 60శాతం మేర నిధులు దారి మళ్లుతున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఉన్నతాధికారులు దృష్టిసారించి ఫాగింగ్ విభాగంలో అవినీతిని అరికట్టడంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పెరిగిన దోమల తీవ్రత..
గతంలో ఫాగింగ్ విషయంలో..యాంటీ లార్వా ఆపరేషన్‌లో సంబంధిత ఎంటమాలజీ విభాగం అధికారులు ముందుండి ఇంటింటికీ సర్వేలు చేస్తూ దోమలను కంట్రోల్ చేసే పనులు చేపట్టే వారు. కానీ ఈ ఏడాది పరిస్థితి చూస్తే అందుకు విరుద్ధంగా ఉందని స్థానికులు అంటున్నారు. సాయంత్రం సమయంలో కాసేపు ఇంటి బయటకు వస్తే చాలు దోమలు దండయాత్ర చేస్తున్నాయని వారు వాపోతున్నారు. ముఖ్యంగా మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు మాత్రం రాత్రి సమయాల్లో దోమలకు బెడదకు కంటినిండా నిద్రకు కూడా నోచుకోలేని పరిస్థితి

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

