హైదరాబాద్ : నిజామాబాద్(Nizamabad )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రావెల్ బస్సు బోల్తాపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఇందల్వాయి మండలం గన్నారం వద్ద గల 44 జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు బోల్తాపడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటనే జంకుతున్నారు. ప్రభుత్వం ప్రమాదాలు జరగకుండా దృష్టి పెట్టాలని, అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
JEE Mains | నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుభవార్త.. జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు మరో చాన్స్