NTR | ఎన్టీఆర్‌కు భుజం గాయం.. అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల, అందులో ఏముంది అంటే..!
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు కీలక అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా ఆయన భుజం గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ గాయం గురించి ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. తాజాగా వైద్యుల సూచన మేరకు గాయమైన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు.
NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకు కీలక అప్డేట్ వచ్చింది. కొంతకాలంగా ఆయన భుజం గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ గాయం గురించి ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు. తాజాగా వైద్యుల సూచన మేరకు గాయమైన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ఎన్టీఆర్‌కు ఆగస్టు 12న హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో భుజానికి సర్జరీ నిర్వహించనున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఏ. పురంచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం సర్జరీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
మొదట ఈ భుజం గాయం శస్త్రచికిత్స లేకుండానే నయం అవుతుందని భావించినప్పటికీ, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సర్జరీ చేయడం ఉత్తమమని వైద్యులు సూచించినట్లు ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. వైద్యుల సలహాను స్వీకరించిన ఎన్టీఆర్ సర్జరీకి అంగీకరించారు. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన షూటింగ్‌లకు దూరంగా ఉండి పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టనున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, నందమూరి కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
ఎన్టీఆర్ భుజానికి సర్జరీ జరగనుండటం, ఆ తర్వాత వైద్యులు 6-8 వారాల విశ్రాంతిని సూచించడంతో ‘డ్రాగన్’ షూటింగ్ షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే సినిమా పనులను ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే కొనసాగించేలా చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యమే అత్యంత ముఖ్యమని అభిమానులు భావిస్తున్నారు. సర్జరీ విజయవంతంగా పూర్తై ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

