కోల్‌కతా: యువతి పుట్టిన రోజు సెలబ్రేషన్ పేరుతో పరిచయం ఉన్న వ్యక్తి మరో వ్యక్తి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బర్త్ డే పార్టీ జరిపారు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang-Raped By 2 Men) బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. దక్షిణ కోల్‌కతా పూజా కమిటీ హెడ్ అయిన చందన్ మాలిక్‌కు కొన్ని నెలల కిందట హరిదేవ్‌పూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయిన ద్వీప్ బిశ్వాస్కు ఆమెను పరిచయం చేశాడు. ఆ యువతిని పూజా కమిటీలో చేర్చుతామని వారిద్దరూ హామీ ఇచ్చారు. ఈ ముగ్గురు తరచుగా మాట్లాడుకుంటున్నారు.
కాగా, సెప్టెంబర్ 5న ఆ యువతి పుట్టిన రోజు. దీంతో శుక్రవారం రాత్రి బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో చందన్ ఆ యువతిని రీజెంట్ పార్క్ ప్రాంతంలోని దీప్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బర్త్ డే పార్టీ తర్వాత వారు భోజనం చేశారు. ఆ యువతి తన ఇంటికి వెళ్తానని చెప్పగా వారిద్దరూ డోర్ లాక్ చేశారు. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
మరోవైపు మరునాడైన శనివారం ఉదయం ఆ యువతి అక్కడి నుంచి తప్పించుకున్నది. తన ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులైన చందన్, దీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Girl Gives Birth, Infant Dies | బాలికపై వ్యక్తి అత్యాచారం.. ఆమె ప్రసవించిన శిశువు మృతి
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని.. రోజుకు రూ.522 జీతం