Pakistan Strike | కాబూల్ ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడి.. భారీ పేలుడు వీడియో వైరల్!
Pakistan Strike | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి అనంతరం ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో.. ఆకాశంలోని భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి
Pakistan Strike | అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి అనంతరం ఆస్పత్రిలో భారీ పేలుడు సంభవించడంతో.. ఆకాశంలోని భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. మరో వీడియాలో భద్రతా సిబ్బంది టార్చ్‌లైట్ వెలుగులో శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికి తీస్తుండగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
పాక్ వైమానిక దాడిలో 400 మంది మృతి
కాబూల్‌లోని డ్రగ్స్ రిహాబిలేషన్కు సంబంధించిన ఆస్పత్రిపై సోమవారం రాత్రి 9 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) పాక్ వైమానిక దాడి జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి భవనం చాలావరకు ధ్వంసమైందని పేర్కొన్నారు. దాడుల్లో 400 మంది వరకు మరణించారని.. సుమారు 250 మంది గాయపడ్డారని చెప్పారు. వైమానిక దాడులతో ఆస్పత్రి భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని.. వాటిని అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ దాడిలో మాదక ద్రవ్యాలకు బానిసలైన వారి చికిత్స కోసం ఉపయోగిస్తున్న పరికరాలు చాలా వరకు ధ్వంసమయ్యాయని అఫ్గాన్ ఆరోగ్య శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. మృతుల్లో ఎక్కువగా రోగులే ఉన్నారని పేర్కొన్నారు. కాగా, పాక్ దాడిని ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రంగా ఖండించారు. ఇది అఫ్గాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యేనని అభివర్ణించారు.
ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేయలేదు.. ఖండించిన పాక్
కాబూల్‌లోని ఆస్పత్రి లక్ష్యంగా దాడులు చేశారని ఆఫ్గానిస్థాన్ చేసిన ఆరోపణలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఆస్పత్రి లక్ష్యంగా ఎటువంటి దాడులు జరపలేదని స్పష్టం చేసింది. తాలిబాన్ సైనిక స్థావరాలు, ఆయుద గోదాములు, ఉగ్రవాద మద్దతు కేంద్రాలే లక్ష్యంగా కచ్చితమైన దాడి చేశామని పాకిస్థాన్ సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పౌరులకు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండానే జాగ్రత్త పడుతూనే దాడులు చేశామని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

