న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ధైర్యాన్ని ప్రదర్శించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోరారు. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకానికి ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించాలని సవాల్ విసిరారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ప్రధాని కొంత ధైర్యం చూపించాలని మేం కోరుతున్నాం. దేశం మొత్తం మీ వెనుక ఉన్నది. భారత్ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించింది. బదులుగా మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. అప్పుడు ట్రంప్ తలొగ్గుతారో లేదో చూడండి’ అని అన్నారు.
కాగా, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపుపై మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు, అలాంటి చర్య ముఖ్యంగా గుజరాత్ రైతులకు ప్రతికూలంగా ఉంటుందని, అమెరికా రైతులను సంపన్నం చేస్తుందని అన్నారు.
మరోవైపు కేంద్రం నిర్ణయం వల్ల భారతీయ పత్తి ఉత్పత్తిదారులను దుర్బలంగా మార్చిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి తగిన మార్కెట్ లేదని ఆరోపించారు. దీంతో అప్పుల భారంతో కుంగిపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశమున్నదని ఆయన హెచ్చరించారు.
Also Read:
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో లైబ్రరీ క్లర్క్‌గా పని.. రోజుకు రూ.522 జీతం
Woman Gang-Raped By 2 Men | పుట్టిన రోజు పార్టీ తర్వాత.. యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం
Girl Gives Birth, Infant Dies | బాలికపై వ్యక్తి అత్యాచారం.. ఆమె ప్రసవించిన శిశువు మృతి