న్యూఢిల్లీ: ఓ ఫ్రెండ్ వీడియో రికార్డ్ చేస్తుండగానే.. ఢిల్లీలోని ఓ వ్యక్తి(Delhi Man) గన్‌తో తన ఛాతిలో కాల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతోంది. వీడియో తీస్తున్న వ్యక్తికి.. తన మిత్రుడు ఏం చేస్తున్నాడో తెలియకుండా ఆ ఘటన జరిగిపోయింది. ఒళ్లు జలదరించే రీతిలో ఉన్న వీడియోలో.. ఓ వ్యక్తి పిస్తోల్‌లోని మ్యాగ్జిన్ లోడ్ చేశాడు. ఆ తర్వాత ఆ వెపన్‌ను తన ఛాతిలో పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కాడు. మ్యాగ్జిన్లోకి ఎలా బుల్లెట్ పెట్టారో వీడియో తీస్తున్న వ్యక్తి చెప్పాడు. బటన్ క్లిక్ చేస్తే అది లోపలికి వెళ్తుందని పేర్కొన్నాడు. చూడటానికి ఫిట్‌గా ఉన్న వ్యక్తి.. సైలెంట్‌గా గన్ తీసి తన ఛాతిలో కాల్చుకునే ప్రయత్నం చేస్తాడు.
ఆ సమయంలో వీడియో తీస్తున్న వ్యక్తి ఫైరింగ్ చేయవద్దు అంటాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత ఆ వ్యక్తి గన్ను ఛాతిలో ఎడమవైపు పెట్టుకుని కెమెరాకు స్మైల్ ఇస్తూ ట్రిగ్గర్ను సడెన్‌గా నొక్కేస్తాడు. అతని శరీరం నుంచి రక్తం చిందే మూమెంట్ కూడా వీడియోకు చిక్కింది.
గన్‌తో కాల్చుకున్న వ్యక్తిని పవన్‌గా గుర్తించారు. న్యూ అశోక్ నగర్లో ఈ ఘటన జరిగింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ వ్యక్తి మరణించినట్లు తేల్చారు. వీడియోలో ఉన్న పిస్తోల్‌కు లైసెన్స్ ఉంది. ఆ వీడియో తీస్తున్న వ్యక్తిదే ఆ పిస్తోల్. ఈ ఘటనకు చెందిన దర్యాప్తు చేపడుతున్నారు.
New Delhi – A shocking incident in Delhi’s Dallupura area claimed the life of a young man named Pawan, who died from an accidental self-inflicted gunshot wound while attempting a dangerous stunt for a video. pic.twitter.com/jOcGaypKQB
— NextMinute News (@nextminutenews7) March 17, 2026