Accident | మియాపూర్లో యూటర్న్ వద్ద ప్రైవేటు బస్సు బోల్తా.. ఒకరికి తీవ్రగాయాలు
Accident | హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పార్మా కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
Accident | మియాపూర్, మార్చి 17 : హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పార్మా కంపెనీకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలవ్వగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
లీ ఫార్మా కంపెనీకి చెందిన మినీ బస్సు మంగళవారం ఉదయం 80 గంటలకు 10 మంది ఉద్యోగులతో కేపీహెచ్బీ నుంచి గడ్డిపోతారం బయల్దేరింది. 8.30 గంటల సమయంలో మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి వెళ్లే మార్గంలో బీకే ఎన్క్లేవ్ సమీపంలో యూటర్న్ వద్ద రెండు బస్సులు సమాంతరంగా వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఓ బస్సును ఆకస్మికంగా కుడి వైపునకు తిప్పారు. దీంతో లీ ఫార్మాకు చెందిన బస్సు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తలకు గాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.
రహదారిపై బస్సు బోల్తా పడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్రేన్ సాయంతో బస్సును పైకి లేపి, పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

