Aasha Workers | నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నాగర్కర్నూల్ కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని బలవంతంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త వాతారణం నెలకొంది.
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ తమకు అనేక హామీలను ఇచ్చిందని.. కానీ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ సమస్యల పరిష్కారానికై కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల ధర్నాకు పూనుకున్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఈ ధర్నా చేపట్టగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. మంగళవారం సైతం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Nagarkurnool Aasha Workers2

Nagarkurnool Aasha Workers3