Delhi Metro : భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్ల (Metro Stations) ను తాత్కాలికంగా మూసివేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. కీలక మర్గాలైన రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, ఐటీవో, ఖాన్ మార్కెట్త్పాటు లోక్ కల్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జన్పథ్, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, జోర్ బాగ్, శివాజీ స్టేడియం స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసివేయనున్నట్లు తెలిపింది.
అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్ఛేంజ్ సౌకర్యం మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేసింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జూలై 20న పార్లమెంట్ మార్చ్ సమయంలోనూ పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. మెట్రో నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.