Strait of Hormuz | అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జలసంధిని తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిలో దిగ్బంధనాన్ని అమెరికా తొలగిస్తే, అలాగే, సైనిక మోహరింపులను తగ్గిస్తే వారం రోజుల్లో జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది.
Strait of Hormuz : హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిలో దిగ్బంధనాన్ని అమెరికా తొలగిస్తే, అలాగే, సైనిక మోహరింపులను తగ్గిస్తే వారం రోజుల్లో జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావస్తోంది. ఇంతకాలం హార్ముజ్ జలసంధి పూర్తిస్తాయిలో తెరుచుకోలేదు. మధ్యలో కొంతకాలం తెరుచుకున్నా ఆ వెంటనే మళ్లీ జలసంధిని ఇటు ఇరాన్.. అటు అమెరికా దిగ్బంధించాయి.
దీంతో హార్ముజ్ నుంచి నౌకల రవాణా అతికష్టంగా మారింది. ప్రపంచ వాణిజ్యంలో, చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్‌ను తెరవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. హార్ముజ్ మూసి ఉంచడం వల్ల ఇరాన్‌తోపాటు అమెరికాకు కూడా ఆర్థికంగా భారంగానే మారింది. దీంతో రెండు దేశాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన ప్రకటన ఆసక్తి కలిగిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఇరాన్-అమెరికా ముగింపునకు మధ్యవర్తిత్వం వహించే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులతో పెజెష్కియాన్ చర్చలు జరిపే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధి తెరిచే అంశానికి సంబంధించి అమెరికా తన సైనిక మోహరింపును మిడిల్ ఈస్ట్ నుంచి తగ్గించాలి. ఇదే సమయంలో జలసంధిని దిగ్బంధించిన అమెరికా.. వెనక్కు వెళ్లిపోవాలి. ఇది జరిగితే వారం రోజుల్లోగా హార్ముజ్‌ను తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక ప్రగతికి హార్ముజ్ జలసంధి నౌకా రవాణా మార్గం చాలా కీలకం.
ప్రపంచానికి అవసరమైన చమురులో 20 శాతం ఈ మార్గం నుంచే రవాణా అవుతుంది. వివిధ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలకు కూడా హార్ముజ్ కీలకంగా ఉంది. అయితే, హార్ముజ్‌ను మూసివేయడంతో చమురు రవాణా నిలిచిపోయింది. అంతర్జాతీయంగా చమురు ధరలు 100 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో అనేక దేశాలు ఇప్పటికీ చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

