Anant Nag : సుప్రసిద్ధ నటుడు అనంత్ నాగ్(Anant Nag) ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) అవార్డును స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఎక్తా నగర్లో మంగళవారం కన్నులపండువగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆహుతుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన సగర్వంగా ఈ పురస్కారాన్ని తీసుకున్నారు.
విలక్షణ పాత్రలతో మెప్పించిన అనంత్ నాగ్ మంగళవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. సినిమాలు, టీవీ రంగంలో ఏడు దశాబ్దాలకుపైగా విశేష సేవలకుగానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. గుజరాత్, ఎక్కానగర్లో జరిగిన 72వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో అనంత్ నాగ్‌కు ముర్ము ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇచ్చారు. నట దిగ్గజమైన ఆయన అవార్డు తీసుకుంటుండగా ఆహుతులందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.
Veteran actor #AnantNag honoured with the #DadasahebPhalkeAward at the 72nd National Film Awards, for his remarkable contribution to Indian cinema. ✨
[Video Courtesy: PIB_India/X]#72ndNationalFilmAwards #Trending pic.twitter.com/zYvkAskOqX
— Filmfare (@filmfare) September 22, 2026
తద్వారా డాక్టర్ రాజ్‌కుమర్ అనంతరం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న రెండో కన్నడ నటుడిగా గుర్తింపు సాధించారీ వెటరన్. దివంగత రాజ్‌కుమార్ 1995లో ఈ అవార్డు అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో విశేష సేవలందించిన వారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరిస్తుంది. 1969 నుంచి పలువురు సినీ దిగ్గజాలు ఈ అవార్డు స్వీకరించారు. 2024 సంవత్సరానికిగానూ అనంత్‌నాగ్‌కు ఈ గౌరవం లభించింది.
‘గౌరవనీయులందరూ విచ్చేసిన ఈ వేడుక గొప్పదనాన్ని నేను అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ రోజు మీ అందరి సమక్షంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక నటుడిగా మీరంతా నా ప్రదర్శనను చూశా. కొన్ని అద్భుతమైన పాత్రలను చూశారు. నాకు 12 ఏళ్లు వచ్చేంత వరకూ ఆశ్రమంలో పెరిగా. తొలుత నాకు ఓ నాటకంలో అవకాశం వచ్చింది. ఈ అవార్డు నా ఒక్కడి సొత్తు కాదు. నిర్మాతలు, దర్శకులు, అసోసియేటెడ్ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఇది చెందుతుంది. దశాబ్దాలుగా నా పాత్రలను హృదయాల్లో దాచుకున్న లక్షలాదిమందికి ఈ పురస్కారం దక్కుతుంది.
Veteran actor Anant Nag receives the #DadasahebPhalkeAward at the 72nd National Film Awards, recognising his remarkable contribution to Indian cinema. 🎬🏆👏#IndiaCelebratesCinema #FilmsThatUnite pic.twitter.com/4MDY4LNqcP
— PIB India (@PIB_India) September 22, 2026
నా ప్రసంగాన్ని ముగించే ముందు శంకరాచార్య సూక్తి చెబుతా. వందే మాతరం. ఈ గొప్పదేశం నా జన్మభూమి. కర్నాటక నా కర్మభూమి. భారత్ అనేది నా ధర్మభూమి’ అని పేర్కొన్న అనంత్ నాగ్ 1970ల్లోనే సినిమాల్లోకి వచ్చారు. 1973లో ‘సంకల్ప’ అనే కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ‘అంకుర్’ చిత్రంలో నటించారు. కేజీఎఫ్ : చాప్టర్ 1లో ప్రసిద్ధ జర్నలిస్టుగా, కథకు మూల రచయితగా మెప్పించిన అనంత్‌నాగ్.. కామెడీ ఎంటర్టైనర్ ‘భీష్మ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.