Railway Recruitment | రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 4 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
Railway Recruitment : కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ అందించింది. రైల్వే శాఖలో 4 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Railway Recruitment : కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్ అందించింది. రైల్వే శాఖలో 4 వేలకుపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజనీర్ (జేఈ) సహా 4,098 పోస్టులకు ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా జూనియర్ ఇంజనీర్ (జేఈ), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటల్లర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ) పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిస్ (సీఈఎన్) నెం.04/2026 ప్రకటించింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చే ఆగష్టు 14న ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13, 2026 వరకు రీజియన్ల వారీగా దరఖాస్తులు చేసుకోవచ్చు. తెలంగాణ వారు ఆర్ఆర్బి సైట్‌కు సంబంధించి సికింద్రాబాద్ రీజియన్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల వారు కూడా రీజియన్ల ప్రకారం అప్లికేషన్లు సమర్పించాలి.
మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా లేదా బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు, ఇతర మినహాయింపులు వర్తిస్తాయి. విద్యార్హతలు, ఖాళీల వివరాలు, వయసు పరిమితి, వేతనం వంటి పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బి సైట్‌ను సందర్శించండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

