Karim Khan: ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. డిస్మిస్ చేయాలన్న యోచనలో సభ్య దేశాలు
Karim Khan : అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చీఫ్ ప్రాసిక్యూటర్‌గా చేస్తున్న కరీమ్ ఖాన్‌ను తొలగించేందుకు ప్రక్రియ మొదలైంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆ ప్రాసిక్యూటర్‌పై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. ఆయన్ను డిస్మిస్ చేసేందుకు సభ్య దేశాలు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నాయి.
న్యూయార్క్: అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చీఫ్ ప్రాసిక్యూటర్‌గా చేస్తున్న కరీమ్ ఖాన్(Karim khan)ను తొలగించేందుకు ప్రక్రియ మొదలైంది. పాకిస్థాన్ మూలాలు ఉన్న ఆ ప్రాసిక్యూటర్‌పై లైంగిక వేధింపుల కేసులు నమోదు అయ్యాయి. మరో వైపు ఆయనపై అమెరికా వత్తిడి కూడా పెరుగుతోంది. బ్రిటన్‌కు చెందిన లాయర్ కరీం ఖాన్.. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు అరెస్టు వారెంట్ జారీ చేయాలని 2024లో ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ డిమాండ్ చేశారు. అయితే ఆ కేసులో అమెరికా ఆయనపై వత్తిడి తెస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. వారెంట్ ఇచ్చిన తర్వాత అమెరికా నుంచి ఐసీసీపై వత్తిడి పెరిగినట్లు తెలిసింది.
స్కాట్లాండ్లోని ఎడన్బర్గ్ లో కరీం ఖాన్ జన్మించారు. లండన్ కింగ్స్ కాలేజీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఐసీసీలో 2021 జూన్‌లో కరీం ఖాన్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా చేరాడు. అంతకుముందే ఆయన ఫేమస్ క్రిమినల్ లాయర్. ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో కీలక పాత్రల్లో పని చేశారు. ఉక్రెయిన్, సుడాన్, మయన్మార్, ఇజ్రాయల్-హమస్లో జరిగిన యుద్ధ నేరాల కేసులను దర్యాప్తు చేశారు. అయితే జూనియర్ సిబ్బందిని లైంగికంగా వేధించినట్లు కరీం ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి చేపట్టిన దర్యాప్తులో కరీం వేధింపులు రుజువయ్యాయి. దీంతో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి కరీం ఖాన్‌ను డిస్మస్ చేయాలన్న డిమాండ్ పెరిగింది.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో ఉన్న 125 సభ్య దేశాలు కరీం తొలగింపుపై ఓటింగ్ నిర్వహించనున్నాయి. తన అంగీకారం లేకుండానే వేధింపులకు పాల్పడినట్లు కరీం ఖాన్ ఆఫీసులోని ఓ మహిళా లాయర్ పబ్లిక్‌గా ఫిర్యాదు చేసింది. 2009లో తనను కూడా వేధించినట్లు మరో మహిళ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీం ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. కానీ ఐసీసీలోని సభ్య దేశాలు మాత్రం ఆయన్ను చీఫ్ ప్రాసిక్యూటర్ పోస్టు నుంచి డిస్మస్ చేయాలన్న యోచనలో ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

