Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Dhinidhi Desinghu | భారత స్విమ్మింగ్ చరిత్రలో ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.బెంగళూరుకు చెందిన 16 ఏండ్ల ఈ యువ స్విమ్మర్ సెనెగల్ లోని డాకర్ లో జరుగుతున్న యూత్ ఒలింపిక్ లో కాంస్య పతకం నెగ్గింది.
Dhinidhi Desinghu | భారత స్విమ్మింగ్ చరిత్రలో ధినిధి దేశింగు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.బెంగళూరుకు చెందిన 16 ఏండ్ల ఈ యువ స్విమ్మర్ సెనెగల్ లోని డాకర్ లో జరుగుతున్న యూత్ ఒలింపిక్ లో కాంస్య పతకం నెగ్గింది. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగంలో 56.27 సెకన్లలోమూడోస్థానంతో లక్ష్యాన్ని చేరుకుని జాతీయ రికార్డు నెలకొల్పింది. యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనతను సొంతం చేసుకుంది. ధినిధి విజయం యావత్ దేశానికి గర్వకారణమని ఆమెకు మద్దతుగా నిలుస్తున్న బజాజ్ ఫిన్సర్వ్ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలోనే బజాజ్ ఫిన్సర్వ్ ధినిధికి మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రెసిడెంట్ మనవ్ మియాన్వాల్ మాట్లాడుతూ..“ధినిధి సాధించిన చారిత్రాత్మక కాంస్య పతకం దేశానికి గర్వకారణం. పెద్ద కలలు కనే ప్రతి యువ క్రీడాకారుడికి ఆమె విజయం స్ఫూర్తినిస్తుంది. వ్యక్తిగత ప్రతిభకు సమష్టి మద్దతు తోడైతే భారత క్రీడాకారులు ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడగలరని ఆమె నిరూపించింది. కెరీర్ ప్రారంభ దశలోనే అండగా నిలవడం ద్వారా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించి, క్రీడాకారులు తమ శిక్షణ, అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు బజాజ్ ఫిన్సర్వ్ సహకరిస్తోంది“ అని పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

