Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman poses as TTE on train | రాత్రి వేళ కదులుతున్న రైలులో ఒక మహిళ టీటీఈగా నటించింది. ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేసింది. టిక్కెట్లు లేని వారి పేర్లను ఒక పేపర్‌పై రాసింది. అయితే ఆ మహిళపై ఒక ప్రయాణికుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె గుర్తింపు కార్డు చూపించాలని డిమాండ్ చేశాడు.
ముంబై: రాత్రి వేళ కదులుతున్న రైలులో ఒక మహిళ టీటీఈగా నటించింది. ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేసింది. టిక్కెట్లు లేని వారి పేర్లను ఒక పేపర్‌పై రాసింది. అయితే ఆ మహిళపై ఒక ప్రయాణికుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె గుర్తింపు కార్డు చూపించాలని డిమాండ్ చేశాడు. కంగారుపడిన ఆ మహిళ మెల్లగా జారుకున్నది. (Woman poses as TTE on train) నవంబర్ 3న మహారాష్ట్ర నుంచి బీహార్ వెళ్తున్న రైలులో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)గా నటించింది. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో జనరల్ కంపార్ట్మెంట్లోని ప్రయాణికులను నిద్రలేపి వారి టిక్కెట్లను తనిఖీ చేసింది.
కాగా, టిక్కెట్ లేని ఒక ప్రయాణికుడు, టిక్కెట్ చూపించడానికి సంకోచించిన మరో ప్రయాణికుడిని ఆ మహిళ బెదిరించింది. టిక్కెట్ తీసుకోవాలని వారికి చెప్పింది. ఆ తర్వాత ఆ ప్రయాణికుడి పేరు ఆమె అడిగింది. తన బ్యాగ్ నుంచి ఒక ఖాళీ కాగితం తీసి దానిపై ఏదో రాయడం ప్రారంభించింది.
అయితే ఆ మహిళ టీటీఈ యూనిఫాం ధరించకపోవడాన్ని ఒక ప్రయాణికుడు గమనించాడు. సాధారణంగా రాత్రి వేళ టీటీఈలు రైళ్లలో ప్రయాణికులను తనిఖీ చేయరు. ఈ నేపథ్యంలో ఆ మహిళపై ఆ వ్యక్తి అనుమానం వ్యక్తం చేశాడు. గుర్తింపు కార్డు చూపించమని ఆమెను అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. రైల్వే అధికారులకు మాత్రమే తన గుర్తింపు కార్డు చూపిస్తానని ఆమె చెప్పింది.
మరోవైపు టీటీఈ యూనిఫాం లేదా గుర్తింపు లేకుండా అర్ధరాత్రి వేళ రైళ్లలో టిక్కెట్లను ఎలా తనిఖీ చేస్తారని ప్రయాణికుడు ఆ మహిళను పదేపదే ప్రశ్నించాడు. మరికొందరు కూడా నిలదీయడంతో ఆమె కంగారుపడింది. అక్కడి నుంచి జారుకునేందుకు ప్రయత్నించింది. అడ్డుకునేందుకు ఆ ప్రయాణికుడు ప్రయత్నించగా తనను వేధించడంపై ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించింది. ఆ తర్వాత ముఖానికి మాస్క్ ధరించిన ఆ మహిళ, ఆ రైలులో ఉన్న జనంలో కలిసిపోయి అదృశ్యమైంది.
కాగా, ఆ రైలులో ప్రయాణించిన నీతూ అనే ప్రయాణికురాలు ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రైల్వే అధికారుల కళ్లగప్పి ఆ మహిళ ఎలా టీటీఈగా నటించి ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసిందని ఆమె ప్రశ్నించారు. అలాగే ప్రయాణికుల నుంచి ఆ మహిళ డబ్బులు వసూలు చేసిందా? అన్న అనుమానాలు కూడా ఆమె వ్యక్తం చేశారు. ఆ ప్రయాణికురాలి పోస్ట్‌కు రైల్వే స్పందించింది. దర్యాప్తు కోసం ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేసినట్లు ట్వీట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Asks
- caught
- ID. Railways
- Passenger
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

