వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాంపురం పెద్ద చెరువు నిండింది. అయితే చెరువు తూముకు సంబంధించిన షట్టర్లు మరమ్మతులు చేయకపోవడంతో విలువైన నీరు వృథాగా బయటకు పోతోంది. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు...
– షట్టర్ల మరమ్మతులు చేయించడంలో అధికారుల నిర్లక్ష్యం
– నీటి వృథాపై రైతుల ఆవేదన
చుంచుపల్లి, నవంబర్ 04 : ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాంపురం పెద్ద చెరువు నిండింది. అయితే చెరువు తూముకు సంబంధించిన షట్టర్లు మరమ్మతులు చేయకపోవడంతో విలువైన నీరు వృథాగా బయటకు పోతోంది. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో చెరువులో చేరిన నీటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాల్సిన సమయంలో ఇలా వృథాగా పోతుండడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
రాంపురం పెద్ద చెరువు నీరు వృథాగా పోతుంది, తూము షట్టర్లు మరమ్మతులు చేయించాలని ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు సింగరేణి అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే షట్టర్ల మరమ్మతులు చేపట్టి ఉంటే ప్రస్తుతం చెరువులో చేరిన నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని పేర్కొంటున్నారు.
యాసంగిసాగుకు నీటి కొరత తప్పదా?
ఈ చెరువు ఆయకట్టు కింద సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రస్తుతం వృథాగా పోతున్న నీటిని నిల్వ చేసుకోగలిగితే రానున్న రబీ సీజన్లో ఆయకట్టు రైతులకు సాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విలువైన నీరు వృథాగా పోతుండడంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, సింగరేణి యాజమాన్యం స్పందించి పెద్ద చెరువు తూము షట్టర్లకు తక్షణమే మరమ్మతులు చేయించి నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
Jeevan Reddy | రేవంత్ మూడేళ్లలో రెండు పిల్లర్లకు మరమ్మత్తు చేయించలేకపోయారు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
Munnuru Kapu | మున్నూరు కాపులకు అన్యాయం చేస్తే సహించేది లేదు : రాష్ట్ర కార్యదర్శి హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

