– పాల్గొన్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్
రామగిరి, జూలై 22 : మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతిని నల్లగొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దాశరధి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. దాశరథి తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రముఖ స్వరంగా కీర్తి గడించారని కొనియాడారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని ప్రసిద్ధంగా ప్రకటించి, నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి తన కవిత్వాన్ని శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ, ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరి రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్, గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాస్, కుసుమ, శారద, మల్లేష్, శ్రీను, పాఠకులు పాల్గొన్నారు.