న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను (Lalu Prasad Yadav) ప్రతిపక్ష ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి కలిశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పార్టీ ఎంపీల మద్దతు కోరారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిపై బీజేపీ మండిపడింది. ఆయన కపటత్వానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత, మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ‘సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి (జస్టిస్) సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవికి పోటీపడుతున్న ప్రతిపక్ష అభ్యర్థి. ‘దేశం ఆత్మను కాపాడటానికి నాకు ఓటు వేయండి’ అని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ‘మీరు ఎలాంటి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఒక స్కామ్‌లో దోషిగా తేలిన వ్యక్తిని మీరు కలుస్తున్నారా? ఇది కపటత్వం. దయచేసి ‘దేశం ఆత్మ’ గురించి మాట్లాడకండి’ అని అన్నారు.
కాగా, ప్రతిపక్ష ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కలిసిన లాలు ప్రసాద్ యాదవ్ పార్లమెంటు సభ్యుడు కాదని, ఉప రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఆయనకు ఓటు కూడా లేదని మరో బీజేపీ నేత అమిత్ మాలవీయ తెలిపారు. ‘ఇది కేవలం భయంకరమైన దృశ్యం కాదు. ఉన్నత రాజ్యాంగ పదవిని ఆశించే వ్యక్తి ప్రజా జీవితంలో నిజాయితీపై చేసిన దిగ్భ్రాంతికరమైన ప్రకటన. వారి కపటత్వం బయటపడింది’ అని ఎక్స్‌లో విమర్శించారు.
Also Read:
Fake Babas Arrested | బంగ్లాదేశ్ జాతీయులతో సహా.. 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్
Woman Gang-Raped By 2 Men | పుట్టిన రోజు పార్టీ తర్వాత.. యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం