వనపర్తి టౌన్, ఫిబ్రవరి 26 : మెడికల్ కళాశాల ఆవరణలో యంగ్ ఇండియా స్కూల్‌కు స్థలం కేటాయించవద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి గురువారం మెడికల్ కళాశాల విద్యార్థు లు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి కళాశాలకు, భవిష్యత్‌లో వైద్య సహాయ, వసతుల కోసం 51 ఎకరాల స్థలం కేటాయించారని పేర్కొన్నారు.
ఇటీవల మె డికల్ కళాశాల ఆవరణలోని 8 ఎకరాల స్థలం ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ ప నులు ప్రారంభించారని వాపోయారు. ఇక్కడ ఇతర నిర్మాణాలు చేపడితే మా కళాశాలకు సంబ ంధించి భవిష్యత్‌లో కళాశాల స్థాయిని పెంచితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వెం టనే ఆ నిర్మాణాన్ని ఆపాలని కోరారు.
దీనిపై మాజీ మంత్రి వెంటనే కలెక్టర్‌కు పోన్ ద్వారా సమస్యను వివరించి విశాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ఆనాడు 51 ఎకరాల స్థలం మెడికల్ కళాశాల కోసం కేటాయించడం జరిగిందని, ఈ కళాశాల ఆవరణంలో ఇతర నిర్మాణాలు చేపట్టడం ద్వారా మెడికల్ కళాశాల ప్రమాణాలు పెంచడానికి అడ్డంకి అవుతుందని వెంటనే యంగ్ ఇండి యా స్కూల్ నిర్మాణానికి వేరే స్థలంలో కేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి చెప్పారు.