Hyderabad | భార్య పెట్టే వేధింపులు తాళలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్సైజ్ సీఐగా జాబ్ వచ్చినప్పటి నుంచి తన భార్య దగ్గరకు రావడం లేదని.. వరకట్న వేధింపుల కేసు పెట్టి మానసికంగా చిత్రవధ చేస్తున్నాడని వాపోయాడు. ఈ క్రమంలో ఓ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని నేరెడ్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన శ్రీనివాస్ హైదరాబాద్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. నేరేడ్మెట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి 2013 సట్టపల్లి జ్యోతితో వివాహ జరిగింది. పెళ్లి తర్వాత జ్యోతిని శ్రీనివాస్ ఎంతగానో ప్రోత్సహించాడు. ఈ క్రమంలో జ్యోతి ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా ఉద్యోగం సాధించింది.
అప్పట్నుంచి వారి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. శ్రీనివాస్‌ను నెమ్మదిగా దూరం పెట్టింది. ఇక సీఐగా ప్రమోషన్ వచ్చినప్పటి నుంచి తన ఇంటికి రావడం కూడా మానేసింది. నాలుగు నెలలుగా ఇద్దరూ దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్‌పై జ్యోతి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తన పలుకుబడితో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు కూడా పాల్పడింది.
భార్య పెట్టే వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన శ్రీనివాస్ ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య పెట్టే వేధింపుల గురించి ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. మృతుడి సోదరుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.