ఎన్డీఎస్ఏ చెప్తేనే కాళేశ్వరంపై నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామ ని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.
- సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, జూలై29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామ ని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మాట్లాడారు. మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం బరాజ్‌లను వినియోగించడం లేదని తెలిపారు.
ప్రస్తుతం నిపుణుల సిఫార్సుల మేరకు శాశ్వత పునరుద్ధరణ చర్యలు తీసుకొంటామని చెప్పారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సుప్రీంకోర్టు నిర్ణయంతో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు ఊరట లభించిందని వెల్లడించారు.
కర్ణాటక సీఎంతో భేటీ
ఢిల్లీలోని కర్ణాటక భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. కర్ణాటక, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నదీజలా ల అంశాలపై వారు చర్చించారు. తుంగభద్ర, కృష్ణ నదీజలాల వినియోగంపై ముచ్చటించారు. మంత్రి ఉత్తమ్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
రేపు ఎన్డీఎస్ఏ సమావేశం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల అంశంపై శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేర కు ఇప్పటికే సమాచారం అందించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

