రామడుగు, జూలై 29: ‘మాట్లాడితే చా లు బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్ గాయత్రీ పంప్‌హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చురకలంటించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రీ పంపుహౌస్‌లో బుధవారం 1,2,4 మోటర్లను అధికారులు ప్రారంభించగా, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సుంకె తరలివెళ్లారు.
ఎగిసిపడుతున్న జలాలకు పసుపు కుంకుమ, పూలతో అభిషేకించారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, రైతుల పోరాటాలతోనే సర్కారు ఎల్లంపల్లి బరాజ్ నీటిని ఎత్తిపోస్తున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టు పనికిరాదని ప్రచారం చేసిన వారికి నేడు ఆ ప్రాజెక్టు నీళ్లే సమాధానం చెబుతున్నాయని పేర్కొన్నారు.
ఎన్డీఎస్ఏ నివేదికలో బరాజ్‌ల భద్రత మాత్రమే తమ పరిధిలో ఉం టుందని, నీటి నిర్వహణ, సాగునీటి పంపి ణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం గా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కా వాలనే నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టా రు. కన్నెపల్లి పంపులను ముందుగానే ప్రా రంభించి ఉంటే గాయత్రి పంపుహౌస్ ద్వా రా నీటిని ఎత్తిపోస్తే శ్రీ రాజరాజేశ్వర, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, మల్లన్న సాగర్, కొండపోచమ్మసాగర్‌కు తరలించుకునే అవకాశం ఉండేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం కా రణంగా నారుమడులు ఎండిపోయాయని మండిపడ్డారు. గాయత్రీ పంపుహౌస్ ద్వా రా నీటి విడుదల కొనసాగించి ప్రతి చెరు వు, రిజర్వాయర్‌ను నింపాలని డిమాండ్ చేశారు. మహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.