బెంగళూరు: కదులుతున్న కారు సన్రూఫ్ వద్ద ఒక బాలుడు నిల్చొని ఉన్నాడు. (Boy Standing Through Car Sunroof) అయితే తక్కువ ఎత్తున ఓవర్ హెడ్ బీమ్ కింద నుంచి ఆ కారు వెళ్లింది. దీంతో సన్రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడి తలకు ఆ ఇనుప స్తంభం తగిలింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. విద్యారణ్యపుర ప్రాంతంలోని జీకేవీకే రోడ్డులో ఎరుపు రంగు కారు దూసుకెళ్లింది. సుమారు ఏడేళ్ల బాలుడు కారు సన్రూఫ్ వద్ద తల బయటకు ఉంచి నిల్చొని ఉన్నాడు.
కాగా, ఎత్తైన వాహనాలు వెళ్లకుండా ఒక రైల్వే క్రాసింగ్ వద్ద ఏర్పాటు చేసిన ఓవర్ హెడ్ బీమ్ కింద నుంచి ఆ కారు వెళ్లింది. దీంతో కారు సన్రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడి తల ఆ ఇనుప స్తంభానికి తగిలింది. ఈ నేపథ్యంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎస్యూవీని నడిపిన ఆ బాలుడి తల్లిదండ్రుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. కారు సన్రూఫ్ వద్ద పిల్లలను ఉంచడం చట్టవిరుద్ధమని, వారికి ప్రమాదకరమని విమర్శించారు.
పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొందరు సూచించారు. ఈ సంఘటన కొంతమంది పేరెంట్స్ కళ్ళు తెరిపిస్తుందని ఆశిస్తున్నట్లు మరొకరు పేర్కొన్నారు.
[TW: CHILD HURT]
Very bad parenting! Kids find a sunroof thrilling, but they don’t understand it’s illegal and dangerous. It’s the parents’ duty to know that and act responsibly.
Yet the opposite is happening more often these days. Hope this incident opens some eyes. pic.twitter.com/4PtJkQLDID
— THE SKIN DOCTOR (@theskindoctor13) September 7, 2025
Also Read:
Unmarked Graves | ఉత్తర కశ్మీర్లో భారీగా గుర్తు తెలియని సమాధులు.. 90 శాతం ఉగ్రవాదులవే
Newly wed Woman Ends Life | ప్రేమించిన వ్యక్తితో వివాహం.. పెళ్లైన నాలుగు నెలలకే నవవధువు ఆత్మహత్య
Fake Babas Arrested | బంగ్లాదేశ్ జాతీయులతో సహా.. 14 మంది నకిలీ బాబాలు అరెస్ట్