Aari Aari Song | ‘ధురంధర్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. ఐకానిక్ ‘ఆరి ఆరి’ సాంగ్ విడుదల
Aari Aari Song | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
Aari Aari Song | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కలయికలో తెరకెక్కిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆరి ఆరి’ (Aari Aari) సాంగ్‌ను చిత్రబృందం నేడు విడుదల చేసింది. 2003 నాటి పాపులర్ బాంబే రాకర్స్ (Bombay Rockers) పాటను శాశ్వత్ సచ్దేవ్ ఆధునిక బీట్స్‌తో రీమిక్స్ చేయగా, రణ్వీర్ సింగ్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ పాట విజువల్స్ అదరగొడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ 310 మిలియన్లకు పైగా వ్యూస్‌తో రికార్డులు సృష్టించగా, తాజాగా విడుదలైన ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేసింది.
దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ జస్కిరాత్ సింగ్ రంగీ మరియు హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం భారత గూఢచారి వ్యవస్థ చుట్టూ సాగే హై-వోల్టేజ్ డ్రామాగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉగాది, ఈద్ పండుగల సందర్భంగా మార్చి 19, 2026న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక మార్చి 18 సాయంత్రం నుంచే భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూలు ప్రదర్శించనుండగా, అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే ఈ చిత్రం ‘స్త్రీ 2’ రికార్డులను అధిగమించి ఆల్-టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

