తుంగతుర్తి, మార్చి 12 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మద్దిరాల- తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు కుడి వైపున ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీకి ఆనుకుని కొందరు వ్యక్తులు అక్రమంగా దుకాణాలను నిర్మించుకున్నారు. అట్టి నిర్మాణాలను తొలగించాలని ఆర్ అండ్ బి అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయినా షాప్ యజమానులు నిమ్మకు నీరెత్తిన విధంగా వ్యవహరించడంతో మెయిన్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయినా రోడ్డుకు ఇరుపక్కల మట్టి పోయడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ విషయమై ఆర్ అండ్ బి ఏఈ యుగంధర్‌ను వివరణ కోరగా రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్న దుకాణదారులకు ఇప్పటికే నోటీసులు అందించడం జరిగింది. అయినా దుకాణదారులు తొలగించకపోతే తామే వాటిని తొలగించి రోడ్డు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.