న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్లలో హత్యకు గురైన నిఘా అధికారి అంకిత్ శర్మ కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్, మరో నలుగురికి ఢిల్లీ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. ఇది అరుదైన కేసుల్లో అరుదైనదని.. దోషులకు మరణ శిక్ష విధించాలని ఢిల్లీ పోలీసులు కోర్టులో వాదించారు.
ఈ కేసులో విద్వేషాన్ని ప్రేరేపించడం, అల్లర్లు, దాడి, నేర పూరిత బల ప్రయోగం, నేర పూరిత కుట్ర వంటి అభియోగాలపై హుస్సేన్ను కోర్ట్ దోషిగా నిర్ధారించింది.