లక్నో: అత్యాచారం కేసులో నిందితుడైన వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నాడు. అయితే ఆ పోలీసులను తోసి అతడు పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Rape Accused Pushes Police, Flees ) ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అహ్మద్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెహ్లా గ్రామానికి చెందిన రేప్ కేసు నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సివిల్ డ్రెస్‌లో అతడి ఇంటికి చేరుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీస్ అధికారి ఫోన్లో మాట్లాడుతున్నాడు. బనీను, ప్యాంటుపై ఉన్న నిందితుడు తాను పారిపోనని ఆయనకు చెప్పాడు. అయితే ఉన్నట్టుండి అతడ్ని పట్టుకున్న కానిస్టేబుల్‌ను పక్కకు తోశాడు. ఇంటి మెట్ల మీదుగా పైకి పరుగెత్తాడు. అక్కడి నుంచి కిందకు దూకి పారిపోయాడు.
మరోవైపు ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. నిందితుడు పారిపోయేందుకు గ్రామ పెద్ద, ఇతర గ్రామస్తులు సహకరించినట్లు పోలీసులు ఆరోపించారు. ఆ మేరకు వారిపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులను తోసి నిందితుడు పారిపోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी – बुलंदशहर जिले में रेप का कथित आरोपी अफजाल सादा कपड़े पहने सिपाही राशिद को धक्का देकर भाग निकला। झल्लाई पुलिस ने ग्राम प्रधान रऊफ खान और अन्य ग्रामीणों पर कई धाराओं में मुकदमा लिख डाला। आरोपी अफजाल का परिवार चैन से है, रऊफ खान पर पुलिस कहर बनकर टूट पड़ी है। pic.twitter.com/m3sKAS6ORZ
— Sachin Gupta (@SachinGuptaUP) September 8, 2025
Also Read:
Boy Accidentally Shoots Himself | పిస్టల్‌తో ఆడిన బాలుడు.. ప్రమాదవశాత్తు కాల్చుకుని మృతి
Man Kills Father | తండ్రిని హత్య చేసిన కుమారుడు.. రాత్రంతా మృతదేహం పక్కన నిద్ర
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?