Retirement Benefits | రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ జేఎల్ మృతి…. ఉపిరితిత్తుల మార్పిడికి రూ.1.2 కోట్లు ఖర్చు
Retirement Benefits | మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేసి 2024 నవంబర్ 30న రిటైర్ అయ్యారు.
Retirement Benefits | ఉద్యోగ విరమణ అయినా చేతికందని బెనిఫిట్స్.. ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పలేని ప్రభుత్వం.. నెలల తరబడి ఎదురుచూపులోనే ప్రాణాలు పోతున్నాయి. బకాయిలను చెల్లించని సర్కారు కారణంగా మరో రిటైర్డ్ ఉద్యోగి కన్నుమూశారు. అనారోగ్యం కబళిస్తున్నా.. ప్రభుత్వం నుంచి కదలిక లేకపోవడంతో ఖమ్మం జిల్లాకు చెందిన రిటైర్డ్ జూనియర్ లెక్చరర్ శ్రీధర్ మృతిచెందారు.
ఖమ్మం అర్బన్, మార్చి 15 : మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా పనిచేసి 2024 నవంబర్ 30న రిటైర్ అయ్యారు. ఈయన గతంలో అన్నపురెడ్డిపల్లి, దమ్మపేటలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేశారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య వట్టికొండ వీరకుమారి టీచర్‌గానే పనిచేస్తున్నారు. ఓ కూతురి వివాహం కాగా మరో కుమార్తె బీటెక్ చదువుతున్నది. శ్రీధర్‌కు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు వైద్యశాలలో దాదాపు రూ.1.2 కోట్లు వెచ్చించి లంగ్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు అప్పులు చేసి చికిత్స చేయించారు. రెండు నెలల నుంచి హైదరాబాద్‌లో ఉండి చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం మరణించారు. బెనిఫిట్స్ రాలేదన్న ఒత్తిడి మరింతగా పెరగడంతో ఆరోగ్యం క్షీణించి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్రీధర్ మృతికి సర్కార్‌దే బాధ్యత..
అనారోగ్యంతోపాటు అప్పుల బాధతో మానసిక వేదనకు గురికావడం వల్లనే రిటైర్డ్ జేఎల్ శ్రీధర్ మరణించారని యూటీఎఫ్ ఖమ్మం జిల్లా నేతలు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఆరోపించారు. ఈయన మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం గత డిసెంబర్ నుంచి పలుమార్లు ప్రభుత్వాన్ని సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కూడా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి విన్నవించినా బెనిఫిట్స్ విడుదల చేయలేదని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

