Viral News | సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించిన బాలిక.. రద్దయిన విమాన సర్వీస్..!
Viral News | ఓ చిన్నారి బాలిక సీట్‌బెల్ట్ (Seatbelt) పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్ (Porter Airlines) విమానం టొరంటోకు వెళ్లడానికి సిద్ధమైంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిల్చొని ఉండటాన్ని సిబ్బంది గమనించారు.
Viral News : ఓ చిన్నారి బాలిక సీట్‌బెల్ట్ (Seatbelt) పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేశారు. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పోర్టర్ ఎయిర్‌లైన్స్ (Porter Airlines) విమానం టొరంటోకు వెళ్లడానికి సిద్ధమైంది. రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న సమయంలో విమానంలోని ఓ చిన్నారి సీట్‌బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిల్చొని ఉండటాన్ని సిబ్బంది గమనించారు.
పాప తల్లి, క్యాబిన్ సిబ్బంది కలిసి బాలికకు సీట్‌బెల్ట్ పెట్టడానికి కొన్ని నిమిషాలపాటు ప్రయత్నించారు. అయితే చిన్నారి ఎంతకూ వినకుండా ఏడుస్తూ మారాం చేయడంతో ఏమీ చేయలేకపోయారు. సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే విమానాన్ని టేకాఫ్ చేయడం అసురక్షితమని భావించిన సిబ్బంది వారిని దించేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో విమానం తిరిగి టర్మినల్‌కు వెళ్లింది. చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి దించేసి, నిబంధనల ప్రకారం వారి ఫ్లైట్ ప్లాన్లను తిరిగి ఫైల్ చేసేసరికి రాత్రి 12:30 గంటలు దాటింది.
అప్పటికే రన్‌వేను మూసివేయడంతో విమాన సర్వీసును రద్దుచేశారు. దాంతో అందులోని ప్రయాణికులు రాత్రి విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మరునాడు వారిని అదే విమానంలో గమ్యస్థానాలకు తీసుకువెళ్లారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

