లక్నో: ఆస్తి వివాదంతోపాటు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఒక యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఇటుకతో తలపై కొట్టి చంపాడు. (Man Kills Father) రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే నిద్రించాడు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సర్ఫాబాద్ ప్రాంతంలో నివసించే 43 ఏళ్ల గౌతమ్ శనివారం రాత్రి తన ఇంట్లో నిద్రించాడు. అయితే ఆస్తి వివాదంతోపాటు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు కుమారుడైన 19 ఏళ్ల ఉదయ్ తండ్రి పట్ల ఆగ్రహించాడు. నిద్రిస్తున్న గౌతమ్ తలపై ఇటుకతో కొట్టి చంపాడు. ఆ తర్వాత తండ్రి మృతదేహం పక్కనే అతడు నిద్రించాడు.
కాగా, మరునాడు ఉదయం గౌతమ్ మరణించి ఉండటాన్ని అతడు సోదరుడు గమనించాడు. ఉదయ్ అతడి తండ్రిని చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు నిందితుడైన ఉదయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి హత్యకు వినియోగించిన ఇటుక, అతడి దుస్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Boy Accidentally Shoots Himself | పిస్టల్‌తో ఆడిన బాలుడు.. ప్రమాదవశాత్తు కాల్చుకుని మృతి
Unmarked Graves | ఉత్తర కశ్మీర్లో భారీగా గుర్తు తెలియని సమాధులు.. 90 శాతం ఉగ్రవాదులవే
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?