భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ(కేఐఐటీ) వేదికగా ఎఫ్‌ఐవీబీ వరల్డ్ బీచ్ వాలీబాల్ ప్రో టూర్ టోర్నీ ఘనంగా జరిగింది. ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన టోర్నీలో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల నుంచి 82 అత్యుత్తమ జట్లు పోటీపడ్డాయి.
2028 లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా జరిగిన ఈ పోటీలలో విశ్వక్రీడల పతక విజేతలు, అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు బరిలో దిగారు. దేశంలో ఒక యూనివర్సిటీలో అంతర్జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహించడం ఇది తొలిసారని విద్యాసంస్థ వ్యవస్థాపకులు అచ్యుత సామంత పేర్కొన్నారు.