Kangana Ranaut | విద్యార్థులు, నిరసనకారులపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద ‘జెన్ గట్టర్’ వ్యాఖ్యలపై రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. కంగనా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ తాజాగా మరో సెల్ఫీ వీడియోను విడుదల చేయగా, ఆమె వ్యాఖ్యలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధినేత అభిజిత్ దిప్కే స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
అభిజిత్ మాట్లాడుతూ.. కంగనాని అసలు ఎవరు సీరియస్గా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. విద్యార్థులందరూ నీట్ పరీక్షా వలన నష్టపోయి రోడ్డుమీదకి వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదంటూ కంగనాపై విమర్శలు గుప్పించాడు. మరోవైపు కంగనా తనపై చేసిన విమర్శలపై కాక్రోజ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. తనను పనికిరాని వాడు, నిరుద్యోగి అని పిలవడాన్ని తప్పుపట్టారు. తన గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఆమె విమర్శలు చేశారని మండిపడ్డారు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాంటి తప్పుడు సమాచారమే వస్తుందని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ మాట్లాడుతూ.. కంగనా ఈ దేశ భవిష్యత్ తరాలను, యువతను తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పారు.