న్యూఢిల్లీ, మార్చి 9: కరూర్ తొక్కిసలాట కేసులో మరోసారి ప్రశ్నించేందుకు మంగళవారం తమ ఎదుట హా జరుకావాలని ఆదేశిస్తూ సినీనటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ సమ న్లు జారీ చేసినట్టు అధికారులు తెలిపా రు. ఇదే కేసుకు సంబంధించి జనవరి 12, 19 తేదీల్లో ఇక్కడి తన ప్రధాన కార్యాలయంలో విజయ్‌ని సీబీఐ ప్ర శ్నించింది. తదుపరి ప్రశ్నలు, విజయ్ నుంచి వివరణల కోసం అవసరమైన సమాచారం సేకరించినట్టు చెప్పారు. విజయ్‌కి తాజాగా నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిట్ నుంచి సీబీఐ తీసుకుంది. 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను సీబీఐ సేకరిస్తున్నది. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా 60 మందికిపైగా గాయపడ్డారు.