– నల్లగొండ టూ టౌన్ సీఐ కె.ఆదిరెడ్డి
– టూ టౌన్ పరిధిలో మంగళవారం ఆపరేషన్ మిడ్నైట్
– 25 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు
– తల్లిదండ్రుల సమక్ష్యంలో కౌన్సిలింగ్
నీలగిరి, జూలై 22 : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ టూ టౌన్ సీఐ కె.ఆదిరెడ్డి, ఎస్ఐ డి.సైదాబాబు ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి అపరేషన్ మిడ్నైట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్లగొండ టూ టౌన్ పరిధిలోని పలు కాలనీల్లో, రోడ్ల వెంట, పలు కూడళ్లలో మెరుపు గస్తీ నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న సుమారు 25 మంది మందుబాబులను అదుపులోకి తీసుకున్నారు. విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం మద్యం సేవించిన వారికి ఈపీటీ కేసులు నమోదు చేశారు. విద్యార్థులు, మైనర్ బాలుర తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతంర నల్లగొండ టూ టౌన్ సీఐ కె.అదిరెడ్డి మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే ఏమాత్రం ఉపెక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుండి ప్రతి వీధిలో తనతోపాటు ఎస్ఐలు పెట్రోలింగ్ నిర్వహిస్తారని చెప్పారు. కారణంగా లేకుండా కూడల్లో రాత్రి వేళల్లో తిరిగితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పోలీస్ సిబ్బంది షకీల్, రామలింగయ్య, రాజు, బాలకోటి, సతీష్ పాల్గొన్నారు.

‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు’