ఢిల్లీ: డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మంగళవారం నుంచి బాసెల్ వేదికగా మొదలుకావాల్సి ఉన్న స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవలే ముగిసిన ప్రతిష్టాత్మక ఆల్‌ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు గాను లండన్‌కు పయనమైన ఆమె..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మూడు రోజులు దుబాయ్ విమానాశ్రయంలోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత స్వదేశానికి చేరుకున్నా.. దుబాయ్ ఘటన నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోని సింధు, స్విస్ ఓపెన్ కూడా ఆడకూడదని నిశ్చయించుకున్నట్టు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) తెలిపింది.