Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు కారు: మోహన్ భగవత్
Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వారి ఆందోళనలను పరిష్కరించాలని అన్నారు.
ముంబై: నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వారి ఆందోళనలను పరిష్కరించాలని అన్నారు. (Mohan Bhagwat) గురువారం ముంబైలో జరిగిన ప్రపంచంలోనే ఒకటైన అతిపెద్ద యువజన సదస్సులో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ‘ప్రపంచాన్ని ఏకం చేయడంలో యువత పాత్ర, భారతీయ పద్ధతిలో’ అనే శీర్షికపై జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు. మన ప్రస్తుత తరం కంటే కొత్త తరం జెన్ జెడ్, జెన్ ఆల్ఫా అని తెలిపారు. వారు మరింత నిజాయితీగా ఉంటారని, దేశభక్తి, సేవకు సంబంధించి వారు నిజాయితీగా స్పందిస్తారని తాను భావిస్తున్నానని అన్నారు.
కాగా, నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశ వ్యతిరేకులు లేదా దేశ ద్రోహులు కారని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయితే జెన్ జెడ్ నిరసనలు తెలపకూడదని తాను చెప్పనని, కానీ ప్రజాస్వామ్యంలో దానికి కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పారు. ‘ఒకవేళ గుడ్డిగా ఎవరినైనా నమ్మమని నన్ను అడిగితే, నేను ‘జెన్-జెడ్’ను నమ్ముతా’ అని ఆయన అన్నారు. వారి నిరసనలకు తన మద్దతును ప్రకటించారు.
మరోవైపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ లీక్ వివాదంపై నిరసన తెలిపిన విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడంపై అడిగిన ప్రశ్నకు మోహన్ భగవత్ భిన్నంగా స్పందించారు. తన వద్ద పూర్తి సమాచారం లేదని తెలిపారు. ‘ఈ పరిస్థితికి కారణాలను నేను పరిశీలించాల్సి ఉన్నది. నా దగ్గర ఇంకా పూర్తి సమాచారం లేదు. అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకోవడానికి నేను వివరాలు పరిశీలించాల్సి ఉన్నది. ఏం జరిగిందో లేదా ఎలా జరిగిందో నేను ఇప్పుడే చెప్పలేను. ఈ విషయంలో ఏది సరైనదో, ఏది కాదో కూడా నాకు తెలియదు’ అని ఆయన అన్నారు.
#WATCH | Mumbai, Maharashtra: On recent students’ protest and protesters called ‘anti-nationals’, RSS chief Mohan Bhagwat says, “If Gen Z is protesting, they are not anti-nationals. They are our own people, our next generation…I do not believe Gen Z is like that…I think the… pic.twitter.com/Bxkg4uLS2Z
— ANI (@ANI) August 6, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

