శ్రీనగర్: ఎమ్మెల్యే అరెస్ట్‌పై ప్రజలు ఆగ్రహించారు. భారీగా నిరసన తెలిపారు. ఘర్షణలు చెలరేగడంతో ఆందోళకారులతోపాటు పోలీసులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతోపాటు పరీక్షలను రద్దు చేశారు. జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దోడాకు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ (JK AAP MLA Arrest) ఆ జిల్లా మేజిస్ట్రేట్ హర్విందర్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. గ్రామస్తుడికి అద్దె చెల్లించని ఆ ఎమ్మెల్యే ప్రజా దుర్వినియోగానికి పాల్పడ్డారని, అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించారని మేజిస్ట్రేట్ ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్‌పై కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద కేసు నమోదుకు సోమవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ చట్టం కింద విచారణ లేదా ప్రాసిక్యూషన్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రెండేళ్లపాటు జైలులో ఉంచవచ్చు.
కాగా, ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ అరెస్ట్‌పై దోడా జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆయనను విడుదల చేయాలంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో ఒక పోలీసు అధికారితో సహా పలువురు గాయపడ్దారు. నిరసనలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో దోడా జిల్లాలో కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ అంశాంతి నేపథ్యంలో జమ్ముకశ్మీర్ అంతటా అన్ని బోర్డు పరీక్షలను రద్దు చేశారు.
మరోవైపు ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ కుటుంబం సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసింది. వారికి ఆయన సంఘీభావం తెలిపారు. ఆప్ ఎమ్మెల్యేపై ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) ప్రయోగించి అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఒమర్ అబ్లుల్లా ఆరోపించారు. ఎమ్మెల్యే అరెస్ట్ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుందని అన్నారు.
Doda, J&K: AAP MLA Mehraj Malik was arrested by police while exiting the Dak Bungalow and was sent to Bhaderwah Jail pic.twitter.com/7sDWkopdgj
— IANS (@ians_india) September 8, 2025
Massive protests erupted outside DC Doda office in support of MLA Mehraj Malik. PSA has become a routine weapon, from citizens to elected representatives Time for MLAs across J&K to speak up—before many more fall victim. #StandWithMehrajMalik #JammuAndKashmir pic.twitter.com/BgfWJymWST
— Fayaz Karnahi ( فیاض کرنائ) (@FayazKarnahii) September 9, 2025
Also Read:
Watch: పోలీసులను తోసి పారిపోయిన అత్యాచార నిందితుడు.. వీడియో వైరల్
Watch: కారు సన్‌రూఫ్ వద్ద నిల్చొన్న బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?