ముంబై: ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీపైకి ఎక్కారు. అందులోని వస్తువులను చోరీ చేశారు. బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు వాటిని సేకరించారు. ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Robbery On Moving Truck) దర్యాప్తు చేసిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని సోలాపూర్-ధులే హైవేపై ఈ సంఘటన జరిగింది. రత్నాపూర్ గ్రామం సమీపంలో కదులుతున్న లారీపైకి ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ముఖాలకు మాస్కులు ధరించిన వారిద్దరూ లోడ్‌తో వెళ్తున్న లారీలోని కొన్ని వస్తువులను దొంగిలించారు. వాటిని రోడ్డుపైకి విసిరేశారు. రెండు బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు ఆ వస్తువులను సేకరించారు.
Robbery On Moving Truck
కాగా, ధూమ్ మూవీ తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ధరాశివ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మీడియాకు వారిని చూపించారు. అయితే కదులుతున్న లారీ నుంచి వారు ఏ వస్తువులు చోరీ చేశారో అన్నది వెల్లడించలేదు. ఆ రహదారిపై జరుగుతున్న ఇలాంటి మరిన్ని దొంగతనాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
धुळे-सोलापूर महामार्गावर फिल्मी स्टाईल दरोडा, ट्रकवर चढून लूट#LokmatNews #MaharashtraNews #MarathiNews #Solapurdhule pic.twitter.com/S2LwGRVIMl
— Lokmat (@lokmat) September 9, 2025
Also Read:
JK AAP MLA Arrest | ఎమ్మెల్యే అరెస్ట్‌పై నిరసనలు.. ఇంటర్నెట్ నిలిపివేత, పరీక్షలు రద్దు
man kills two women | ఇద్దరు మహిళలను హత్య చేసిన వ్యక్తి.. పోలీస్ కస్టడీలో ఆత్మహత్య