Forest Officials | ఇటీవలే కాలంలో అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. అయితే, తరచూ వస్తున్న పులి (Tiger)ని బంధించలేదన్న కోపంతో ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఏకంగా అటవీ సిబ్బందినే (Forest Officials) బోనులో బంధించారు. ఈ ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. చామరాజనగర (Chamarajanagar) జిల్లా బొమ్మలాపుర గ్రామంలో (Bommalapura village) తరచూ పులి సంచరిస్తోంది. పులి భయంతో ప్రజలు ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. పొలం, కూలి పనులకు వెళ్లాలన్న భయంతో వణికిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని అటవీ శాఖ అధికారులను కోరారు. దీంతో వారు గ్రామ శివార్లలో బోను ఏర్పాటు చేశారు. అయితే, అందులో పడని పులి.. గ్రామంలోకి మాత్రం వచ్చి వెళ్తుండటం గ్రామస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. సమస్యను పరిష్కరించడంలో విఫలమైన అటవీ సిబ్బందిని పులి కోసం ఏర్పాటు చేసిన బోనులోనే ఎరగా బంధించారు. అనంతరం అక్కడే ధర్నా చేశారు. గ్రామస్థుల ధర్నాకు దిగొచ్చిన అటవీ సిబ్బంది పులిని పట్టుకుని, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వారిని విడిచిపెట్టారు. అటవీ సిబ్బందిని పులి బోనులో బంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Also Read..
Mutton Shortage | దెబ్బకొట్టిన మాంసం కొరత.. మేకలు, గొర్రెలు దొరకక ఏకంగా పెళ్లిళ్లు వాయిదా..!
Viral Video | నిమ్మకాయను తొక్కించబోయి.. కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ కొట్టించిన యువతి
PM Modi | భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్.. ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ రియాక్షన్