Viral Video | నిమ్మకాయను తొక్కించబోయి.. కొత్త కారును ఫస్ట్ ఫ్లోర్ నుంచి పల్టీ కొట్టించిన యువతి
Viral Video | షోరూంలో నుంచి కొన్న కొత్త కారును ముందుగా నిమ్మకాయ మీద నుంచి నడిపించాలని అనుకోవడం పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video | కొత్త కారును కొన్న వెంటనే పూజ చేయించాలని, తామే ఫస్ట్ డ్రైవ్ చేయాలని చాలామంది ఆశపడుతుంటారు. అలా ఓ యువతి ఆశపడటమే ఆమె కొంప ముంచింది. షోరూంలో నుంచి కొన్న కొత్త కారును ముందుగా నిమ్మకాయ మీద నుంచి నడిపించాలని అనుకోవడం పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఆమె చేసిన ఓ చిన్న తప్పిదం కారణంగా కొత్త కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని నిర్మాణ్ విహార్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల మానీ పవార్ తన భర్త ప్రకీప్తో కలిసి తనకు ఎంతో ఇష్టమైన మహీంద్రా థార్ కారును సోమవారం సాయంత్రం రూ.27 లక్షలకు కొనుగోలు చేసింది. నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూం నుంచి తన కారును డెలివరీ తీసుకుంది. అయితే షోరూం నుంచి కారును ఇంటికి తీసుకెళ్లే ముందు నిమ్మకాయ మీద నుంచి పోనివ్వాలని అనుకుంది. ఈ క్రమంలోనే కొత్త కారులోకి ఎక్కిన మానీ.. మెల్లిగా పోనిచ్చింది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ సడెన్‌గా యాక్సిలేటర్‌ను బలంగా తొక్కింది. దీంతో కారు స్పీడ్‌గా ముందుకు తీసుకెళ్లింది. షోరూం గ్లాస్‌ను పగులగొట్టుకుని.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడిపోయింది.
Brand-new Thar crashes out of Delhi showroom after buyer accidentally hits the accelerator
Read more here: https://t.co/3uGgmK2YwH pic.twitter.com/YuFr4felpn
— The Indian Express (@IndianExpress) September 9, 2025
ఆ సమయంలో కారులో మానీ పవార్‌తో పాటు షోరూం ఉద్యోగి వికాస్ కూడా ఉన్నారు. ఒక్కసారిగా కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో వారిద్దరూ గాయపడ్డారు. అప్రమత్తమైన షోరూం సిబ్బంది.. వారిని దగ్గరలోని మాలిక్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Lemon
- Mahindra Thar
- new car
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

