PM Modi | భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్.. ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ రియాక్షన్
PM Modi | భారత్, అమెరికా వాణిజ్య అడ్డంకుల తొలగింపులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
PM Modi | భారత్, అమెరికా వాణిజ్య అడ్డంకుల తొలగింపులో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. తాను కూడా ట్రంప్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
భారత్‌పై అదనపు సుంకాలు విధిస్తుండటంతో అమెరికాతో వాణిజ్య సంబంధాలు బీటలు వారాయి. ఈ నేపథ్యంలోనే ఆ వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ ముందుకొచ్చారు. తన ట్రూత్ సోషల్‌లో స్పందించిన ఆయన.. భారత్, అమెరికా మధ్యవ ఆణిజ్య అడ్డకుంలను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని తెలిపారు. రాబోయే రోజుల్లో తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు పలికేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నానని తెలిపారు.
భారత్‌తో వాణిజ్య చర్చల గురించి ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్, సహజ భాగస్వాములని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తొందరలోనే తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. తమ మధ్య సంబంధం మరింత బలపడతుందని ఆశించారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో భాగంగా తన స్నేహితుడు భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదరుచూస్తున్నానని ప్రకటించారు. రెండు దేశాల భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl
— Narendra Modi (@narendramodi) September 10, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- Pm Modi
- trade barriers
- trump
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

