కాకతీయుల కాలపు శిథిల శివాలయాన్ని పదిలపరచాలి : పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో ఉన్న నందిబోడు పైన కాకతీయుల కాలం (సా.శ.13వ శతాబ్ది) నాటి శిథిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు.
దామరచర్ల, మార్చి 14 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో ఉన్న నందిబోడు పైన కాకతీయుల కాలం (సా.శ.13వ శతాబ్ది) నాటి శిథిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా.ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామానికి చెందిన ఇంజం నర్సిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఆయన శనివారం నాడు నందిబోడు పైనున్న శిల్పాలను గ్రామస్తుల సమక్షంలో పరిశీలించారు. శివాలయంలో చెట్లు, పుట్టలు పెరిగి గోడలు పడిపోయాయని, ఆలయం వెనుక వైపు నిర్మించిన తాత్కాలిక రేకు షెడ్డు కింద కాకతీయుల శైలి ఉట్టిపడుతున్న శివలింగం పానపట్టము, ముట్టె, చెవులు భిన్నమైన నంది, తల, కాళ్లు లేని అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు 700 సంవత్సరాల నాటి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, గ్రామ పెద్దలు పగిడిపాటి శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, కందుల భిక్షారెడ్డి, పలసాని రామ్ రెడ్డి, పోటుపల్లి బాబు, ఉదయ్, సిరసాల సైదులు, నామా రవీందర్, ఆకారపు గోపాల్, మునగాల వెంకటరెడ్డి, ఇంకా శిల్పి బి.వెంకటరెడ్డి, పింగళి వెంకట నాగప్రసాద్ పాల్గొన్నారు.

కాకతీయుల కాలపు శిథిల శివాలయాన్ని పదిలపరచాలి : పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

