Avocado | అద్భుత ఫలం అవకాడో.. మనకెంత మేలు చేస్తుందో తెలుసా..!
పండ్లు ఆరోగ్య గుళికలు. అలాంటి వాటిలో ఒకటి అవకాడో. దీనిలో పోషకాలు మెండు. విదేశీ ఆహారంలో ఎక్కువగా వాడే అవకాడోలు ఇప్పుడు మన దగ్గరా అందుబాటులో ఉంటున్నాయి.
Avocado | పండ్లు ఆరోగ్య గుళికలు. అలాంటి వాటిలో ఒకటి అవకాడో. దీనిలో పోషకాలు మెండు. విదేశీ ఆహారంలో ఎక్కువగా వాడే అవకాడోలు ఇప్పుడు మన దగ్గరా అందుబాటులో ఉంటున్నాయి. కూరగాయగానూ వాడుకోగల ఈ పండు మనకెంత మేలు చేస్తుందో తెలుసా…
అవకాడోలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్-బి అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి.
ఈ ఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు, అధిక బరువు సమస్యతో బాధపడేవారు అవకాడోనూ రోజూవారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.
విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులోఎక్కువగా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండె జబ్బులు వచ్చే ప్రమాదంతగ్గుతుంది.